జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: భారత స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి యువతలో విప్లవ జ్వాలలు రగిల్చిన మహోన్నత అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ‘జై భీమ్ రాజేంద్ర అన్న సైన్యం’ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విప్లవ పోరాటాన్ని, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సంఘీభావం ప్రకటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు, ఆలోచనలకు అనుగుణంగా సమాజంలో మార్పు కోసం, పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. పిడికిలెత్తి పోరాడే తత్వమే జనసేనకు ఆయువుపట్టని, భగత్ సింగ్ చూపిన ధైర్యం, త్యాగనిరతి ప్రతి జనసైనికుడికి నిరంతరం మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ పనిచేస్తామని శ్రేణులు పునరుద్ఘాటించారు.
