రచన: మల్లికార్జున్, జన గళం విజయవాడ రూరల్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం పరిధిలోని రామవరపాడు గ్రామ నూతన పంచాయతీ కార్యదర్శిగా నియమితులైన అధికారి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు హాజరై నూతన కార్యదర్శికి ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు గన్నవరం నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రత్నం నాగేశ్వరరావు, విజయవాడ రూరల్ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాని నూతన కార్యదర్శికి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రామవరపాడు గ్రామాభివృద్ధికి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు పంచాయతీ పాలకవర్గం మరియు అధికారులతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రామవరపాడు శ్రీ వెంకమ్మ తల్లి దేవస్థానం డైరెక్టర్ పోతన దుర్గారావు, ప్రముఖులు కాట్రగడ్డ రాంబాబు, కొండూరు శ్రీహరి, అంగజాల బాబి, లాయర్ కిరణ్, నీలం సాయి రంగారావు, చిలుకూరు ఆంజనేయులు, బాబురావు, గంటా సాంబశివరావుతో పాటు గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యదర్శిని సత్కరించారు.
