జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్ద కాలంగా జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి ఆశ ఆశయాలు ఆశించకుండా నిస్వార్ధంగా కష్టపడిన నాయకుడిగా రమేష్‌ను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. పార్టీ సిద్ధార్థాలకు కట్టుబడి, కష్టకాలంలోనూ అంకితభావంతో పని చేసిన సీనియర్ నేతగా ఆయన సేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఉన్నతమైన స్వభావం, నమ్ముకున్న వ్యక్తులకు ఎప్పుడూ వెన్నంటి నిలిచే మంచి మనసున్న మనిషి లింగమనేని రమేష్ అని అమ్మిశెట్టి వాసు ప్రశంసించారు. పార్టీ కోసం ఆయన అందించిన సేవలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. పార్లమెంట్లో పెద్దల సభ అయిన రాజ్యసభ వేదికగా ప్రజల గళాన్ని ధైర్యంగా వినిపిస్తూ నియోజకవర్గాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అభివర్ణించారు.
స్థానిక దైవానుగ్రహం, అమ్మవారి ఆశీస్సులు ఎంపీ లింగమనేని రమేష్‌పై ఎల్లవేళలా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన పార్టీలో మరెన్నో అత్యున్నత పదవులను అధిరోహిస్తూ, ప్రజలకు మరింత విస్తృతమైన సేవలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వాసు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు, నాయకులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని వెల్లడించారు.
Slug: janasena-state-secretary-ammishetty-vasu-birthday-wishes-to-mp-lingamaneni-ramesh
