బ్రేకింగ్ న్యూస్
సాష్టాంగ నమస్కారం విశిష్టత – శాస్త్ర నియమాలు: సంపూర్ణ శరణాగతికి ప్రతీకగా అష్టాంగ ప్రణామం (జన గళం భక్తి & సంస్కృతి డెస్క్)విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు: Votershelp.in లో ఒక్క నిమిషంలో మీ ఓటు వివరాలు, డిజిటల్ ఓటరు స్లిప్ (జన గళం ఎలక్షన్ గైడ్)ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: 3 దశల్లో పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి (జన గళం ఎలక్షన్ స్పెషల్ బులెటిన్)నోటుకు ఓటును అమ్ముకోకండి: నిజాయితీ గల పాలనకే పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి!మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)సాష్టాంగ నమస్కారం విశిష్టత – శాస్త్ర నియమాలు: సంపూర్ణ శరణాగతికి ప్రతీకగా అష్టాంగ ప్రణామం (జన గళం భక్తి & సంస్కృతి డెస్క్)విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు: Votershelp.in లో ఒక్క నిమిషంలో మీ ఓటు వివరాలు, డిజిటల్ ఓటరు స్లిప్ (జన గళం ఎలక్షన్ గైడ్)ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: 3 దశల్లో పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి (జన గళం ఎలక్షన్ స్పెషల్ బులెటిన్)నోటుకు ఓటును అమ్ముకోకండి: నిజాయితీ గల పాలనకే పట్టం కట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి!మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను భేటీ: కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ (జన గళం ఎలక్షన్ బులెటిన్)1984లో మారుతి 800 ఆన్-రోడ్ ధర కేవలం ₹60,000 మాత్రమే: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన 4 దశాబ్దాల నాటి కొనుగోలు రసీదు (జన గళం ఆటోమొబైల్ డెస్క్)విజయవాడ 24వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపే లక్ష్యం: బ్యాలెట్ సంఖ్య 1 ‘సైకిల్’ గుర్తుకు ఓటేయాలని కూటమి పిలుపు (జన గళం ఎలక్షన్ డెస్క్)40వ డివిజన్‌లో హోరెత్తిన కూటమి ప్రచారం: వంగవీటి రాధాకృష్ణ గారి గెలుపే లక్ష్యంగా అజయ్ వర్మ ఠాకూర్, రవి సౌజన్య పాదయాత్ర (జన గళం ఎలక్షన్ డెస్క్)నాగిరెడ్డిపల్లిలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం: పాల్గొన్న జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు (జన గళం ఎలక్షన్ డెస్క్)వర్జినిటీపై సమాజంలో ఉన్న అపోహలు – వైద్య శాస్త్ర వాస్తవాలు: బ్లీడింగ్ లేదా హైమెన్‌తో శీలపరీక్ష అసాధ్యం (జన గళం హెల్త్ & సొసైటీ డెస్క్)
ఆంధ్ర

గన్నవరం నియోజకవర్గంలో రూ. 4.45 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

gannavaram-mla-yarlagadda-venkatrao-development-works-foundation-bapulapadu
గన్నవరం నియోజకవర్గంలో రూ. 4.45 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గన్నవరం నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు మరియు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బుధవారం బాపులపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలలో పల్లె పండుగ మూడో విడత మరియు ఇతర ప్రత్యేక నిధులతో చేపట్టనున్న సుమారు రూ. 4.45 కోట్ల విలువైన నూతన రోడ్లు, రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

షెడ్యూల్ ప్రకారం సాయంత్రం అయిదు గంటలకు బాపులపాడు మండలం కోడూరుపాడు నాగేంద్రస్వామి ఆలయం నుంచి శోభనాద్రిపురం వరకు, అలాగే శోభనాద్రిపురం మసీదు నుంచి వీరవల్లి కొమ్మూరు రోడ్డు వరకు సుమారు రూ. 1.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ మరియు బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు బాపులపాడు, మడిచర్ల, కొయ్యూరు, సింగన్నగూడెం గ్రామాల్లోని ఐటీఐ కళాశాల రోడ్డు మరియు సాయిబాబా మందిరం సమీపంలో రూ. 1.27 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

Related News Desk విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు: Votershelp.in లో ఒక్క నిమిషంలో మీ ఓటు వివరాలు, డిజిటల్ ఓటరు స్లిప్ (జన గళం ఎలక్షన్ గైడ్)

అదేవిధంగా సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రత్యేక నిధులతో రూ. 1.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఎంఎన్‌కే రోడ్డు నుంచి బిళ్లనపల్లి రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Slug: gannavaram-mla-yarlagadda-venkatrao-development-works-foundation-bapulapadu