బ్రేకింగ్ న్యూస్
పెడనలో వైసిపికి షాక్… టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబంమైలవరంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ… ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో సాకారమైన కలపామర్రు టౌన్‌లో ముమ్మరంగా అభివృద్ధి పనులు… సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాగుడివాడ జనసేన వీరమహిళ నాయకురాలు శీతాల సుభాషినికి జన్మదిన శుభాకాంక్షలుఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశంవిధుల్లో నిర్లక్ష్యం… ఒక వీఆర్వో సస్పెన్షన్, మరో ఇద్దరు రెవెన్యూ అధికారుల సరెండర్విజయవాడలో క్షుద్రమైన హత్య… వివాహేతర సంబంధం మోజులో మహిళను చంపి ముక్కలుగా నరికిన మటన్ షాప్ ఓనర్రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం… లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్: మంత్రి అచ్చెన్నాయుడువిజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అందజేసిన ఆలయ అధికారులుకర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి ప్రారంభమైన జంగిల్ సఫారీ… మళ్లీ మొదలైన ఆధ్యాత్మిక యాత్రలుపెడనలో వైసిపికి షాక్… టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబంమైలవరంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ… ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో సాకారమైన కలపామర్రు టౌన్‌లో ముమ్మరంగా అభివృద్ధి పనులు… సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాగుడివాడ జనసేన వీరమహిళ నాయకురాలు శీతాల సుభాషినికి జన్మదిన శుభాకాంక్షలుఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్… ఆరు వారాల్లో ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశంవిధుల్లో నిర్లక్ష్యం… ఒక వీఆర్వో సస్పెన్షన్, మరో ఇద్దరు రెవెన్యూ అధికారుల సరెండర్విజయవాడలో క్షుద్రమైన హత్య… వివాహేతర సంబంధం మోజులో మహిళను చంపి ముక్కలుగా నరికిన మటన్ షాప్ ఓనర్రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం… లక్ష కోట్ల రూపాయలతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్: మంత్రి అచ్చెన్నాయుడువిజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు… మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అందజేసిన ఆలయ అధికారులుకర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి ప్రారంభమైన జంగిల్ సఫారీ… మళ్లీ మొదలైన ఆధ్యాత్మిక యాత్రలు
ఆంధ్ర

ఏపీ నూతన పీఆర్సీ కమిషనర్‌గా రిటైర్డ్ సీఎస్ దినేష్ కుమార్… ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ap-new-prc-commissioner-retire-cs-dinesh-kumar-appointed
ఏపీ నూతన పీఆర్సీ కమిషనర్‌గా రిటైర్డ్ సీఎస్ దినేష్ కుమార్… ఖరారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషనర్ నియామకంపై స్పష్టత వచ్చేసింది. ఉద్యోగుల పీఆర్సీ కమిషనర్‌గా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నిజాయితీపరుడిగా, అత్యంత సమర్థుడైన అధికారిగా పేరున్న దినేష్ కుమార్ వైపు సీఎం చంద్రబాబు స్వయంగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి కుంభకోణం వ్యవహారంలో బాధ్యులైన నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపై విచారణ జరిపేందుకు దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి సకాలంలో ప్రభుత్మానికి నివేదికను సమర్పించింది. పరిపాలనా రంగంలో ఆయన చూపిన అంకితభావం, సమర్థతను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి ఈ కీలక పదవికి ఆయన పేరును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Related News Desk పెడనలో వైసిపికి షాక్… టిడిపిలో చేరిన మాజీ కౌన్సిలర్ మెహరున్నిసా కుటుంబం

ఉద్యోగుల సంక్షేమం మరియు వారి వేతన సవరణకు సంబంధించి త్వరలోనే పీఆర్సీ కమిషన్ తన విధివిధానాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సమగ్ర సిఫార్సులు రూపొందించడంలో దినేష్ కుమార్ అనుభవం ప్రభుత్వానికి ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించి పూర్తి స్థాయి ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Slug: ap-new-prc-commissioner-retire-cs-dinesh-kumar-appointed