జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ), మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేత సుగుణ బాబు ఇల్లూరి గారు నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ కొణిదెల నాగబాబు గారు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో నిరంతరం కొనసాగుతూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సుగుణ బాబు ఇల్లూరి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పార్టీ స్థాపన నాటి నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తలకు వెన్నంటి నిలుస్తూ, పార్టీ సంస్థాగత బలోపేతంలో నాగబాబు గారు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, జనసేన పార్టీ ఎదుగుదలకు ఆయన నాయకత్వం, అనుభవం మరింత మార్గదర్శకంగా నిలవాలని ప్రార్థించారు.
నాగబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
