జన గళం వైరల్ డెస్క్: భారత మధ్యతరగతి కుటుంబాల సొంత కార్ కలని నిజం చేసి, దేశ ఆటోమొబైల్ చరిత్రను మలుపు తిప్పిన లెజెండరీ కారు ‘మారుతి 800’ (Maruti 800) కి సంబంధించిన 40 ఏళ్ల నాటి కొనుగోలు బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 1984 నాటి ఈ ఇన్వాయిస్లో కారు ధరను చూసి నేటి తరం నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వైరల్ అవుతున్న బిల్లు వివరాలు:
- కొనుగోలుదారుడు: శ్యామ్ భాయ్, బగ్నాన్ గ్రామం, సియోని జిల్లా, మధ్యప్రదేశ్ (M.P.).
- మోడల్ & సంవత్సరం: మారుతి సుజుకి 800 (1984 మోడల్, తెలుపు రంగు).
- ఎక్స్-షోరూమ్ ధర: ₹47,500/-
- ఇతర ఛార్జీలు: ప్యాకింగ్ & ఫార్వార్డింగ్ ఛార్జీలు ₹1,000, హ్యాండ్లింగ్ ఛార్జీలు ₹500, సేల్స్ టాక్స్ ₹6,000, రిజిస్ట్రేషన్ ఫీజు ₹1,500, రోడ్ ట్యాక్స్ ₹2,500, ఇన్సూరెన్స్ ₹1,000, యాక్సెసరీస్ ₹500.
- మొత్తం ఆన్-రోడ్ ధర: సరిగ్గా ₹60,000/- (అక్షరాలా అరవై వేల రూపాయలు మాత్రమే).
నేటి కాలంలో ఒక సాధారణ స్మార్ట్ఫోన్ లేదా టూ-వీలర్ కొనుగోలు చేయడానికే లక్ష రూపాయలకు పైగా ఖర్చవుతున్న రోజుల్లో, నాడు కేవలం అరవై వేల రూపాయలకే సరికొత్త నాలుగు చక్రాల కారు రోడ్డెక్కిన వైనం అందరినీ గతానుభవాల్లోకి తీసుకెళ్తోంది. అయితే నాటి ద్రవ్యోల్బణం ప్రకారం 1984లో ₹60,000 అనేది నేటి లెక్కల్లో దాదాపు ₹5 లక్షల నుండి ₹6 లక్షలతో సమానమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
