జన గళం ఆధ్యాత్మిక డెస్క్: సనాతన ధర్మంలో భగవంతుని ముందు అహంకారాన్ని విడనాడి, సంపూర్ణ ఆత్మసమర్పణతో చేసే అత్యున్నత ప్రణామం ‘సాష్టాంగ నమస్కారం’. కర్ర నేలమీద పడినట్టు శరీరాన్ని పూర్తిగా నేలమీద ఉంచి చేసే ఈ ప్రణామాన్ని ‘దండవత్ ప్రణామం’ అని కూడా పిలుస్తారు. దీనిలోని శాస్త్రీయత, పద్ధతులు మరియు స్త్రీ, పురుషుల మధ్య ఉన్న విధివిధానాల వివరాలు:
- సాష్టాంగ అర్థం: ‘స + అష్ట + అంగ’ = సాష్టాంగ. అనగా శరీరంలోని ఎనిమిది ముఖ్య అంగాలు నేలను తాకేలా బోర్లా పడుకుని చేసే నమస్కారం.
- శ్లోకం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా । పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే ॥
