బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
ఆంధ్ర

రెవెన్యూ శాఖలో వీఆర్ఏల నిరసనల హోరు.. పదిహేను రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు

vra-relay-hunger-strike-and-demands-in-andhra-pradesh
రెవెన్యూ శాఖలో వీఆర్ఏల నిరసనల హోరు.. పదిహేను రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రెవెన్యూ వ్యవస్థలో అత్యంత కీలకమైన అట్టడుగు స్థాయి సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదంటూ గత పదిహేను రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలతో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులకు, ప్రజలకు మధ్య వారధులుగా నిత్యం శ్రమిస్తున్న వీఆర్ఏల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ వ్యవస్థలో దశాబ్దాలు గడుస్తున్నా వీఆర్ఏల ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ భద్రత మెరుగుపడకపోవడం గమనార్హం.

ఇరవై నాలుగు గంటలూ విధుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో అధికారుల ఆదేశాలను పాటిస్తున్న వీఆర్ఏలకు ప్రభుత్వం గౌరవ వేతనం పేరుతో కేవలం పది వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తోందని వారు వాపోతున్నారు. నేడు వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారిలో చాలా మంది డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన విద్యావంతులు కావడం విశేషం. అదనపు అర్హతలు ఉన్నప్పటికీ వారి చేత సచివాలయాలు మరియు తహశీల్దార్ కార్యాలయాల్లో వివిధ రకాల పనులు చేయించుకుంటూ అధికారులు పబ్బం గడుపుకుంటున్నారే తప్ప కనీస వేతనం కల్పించే దిశగా ఆలోచించడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం చెల్లించాలనే డిమాండ్‌ను నెరవేర్చకపోవడం పట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

Related News Desk భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

వీఆర్ఏలకు రిటైర్మెంట్ విధానం సక్రమంగా లేకపోవడంతో వృద్ధాప్యానికి చేరిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులైన వారి స్థానంలో కుటుంబ సభ్యులైన వారసులు వచ్చి విధులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో మాదిరిగా వారసులను పూర్తిస్థాయి ఉద్యోగులుగా పరిగణించే విధానం లేకపోవడంతో యువత అటు సొంత పనులు చేసుకోలేక, ఇటు వీఆర్ఏ విధుల్లో ఇమడలేక సతమతమవుతున్నారు. నామమాత్రపు పది వేల రూపాయల జీవన భృతితో కుటుంబాలు నెట్టుకొ రావడం భారంగా మారిందని, అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Slug: vra-relay-hunger-strike-and-demands-in-andhra-pradesh