ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
Slug: chilli-mohana-rao-and-naga-bala-join-janasena-in-mucharla
జన గళం కృష్ణా జిల్లా డెస్క్:
పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. పెడన మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన చీలి మోహనరావు, చీలి నాగబాల జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్తలు వికృతి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను), లింగం నాగేశ్వరరావు, పెడన ఎంపీపీ చందు అమరేశ్వరరావు, పెడన మండల పార్టీ అధ్యక్షుడు ఊచా వెంకయ్య, ముచ్చర్ల మాజీ సర్పంచ్ మోటేపల్లి చిత్తరంజన్, ముచ్చర్ల బ్యాంకు చైర్మన్ మోటేపల్లి సురేష్, బండ్రెడ్డి అంక ఆంజనేయులు సమక్షంలో నూతనంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
