బ్రేకింగ్ న్యూస్
పెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్రపెన్షన్ అర్హతలపై సమీక్ష అవసరమా? సంక్షేమ పథకాల అమలుపై చర్చకు దారితీస్తున్న ప్రశ్నలుగాంధీనగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను!పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజుదసరా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక సమావేశం… భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా చర్చనమచిలీపట్నంలో ఘనంగా దర్గా అభివృద్ధి పనుల శంకుస్థాపన… ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి నేతలుఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహనరంగా విగ్రహ ఆవిష్కరణ… హాజరై నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడురేపల్లె పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అవనిగడ్డ టీడీపీ ఇంచార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావుతిరువూరులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు… వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నివాళులర్పించనున్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ గొడ్డలివేటు: కోర్టుల్లో అడ్డగోలు వాదనలతో బీసీలకు తీరని అన్యాయం… మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ధ్వజంమచిలీపట్నంలో అభివృద్ధి పరుగులు… సీతారాంపురంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
రాజకీయం

విశాఖ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దేవదాయ భూముల కేటాయింపులో ఉల్లంఘనలు బొలిశెట్టి సత్యనారాయణ సంచలన అఫిడవిట్

bolisetty-satyanarayana-files-affidavit-ap-high-court-vizag-data-center

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విశాఖపట్నంలోని అడవివరం–ముదసలోవ ప్రాంతంలో ప్రతిపాదించిన భారీ హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు మరియు సంబంధిత సంస్థల తీరుపై జల బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సమగ్ర రీజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అదానీ–గూగుల్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో నిర్మ తలపెట్టిన ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరమైన నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలు మరియు దేవాదాయ శాఖ భూముల కేటాయింపు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెట్టారు. తాము ఎప్పుడూ డేటా సెంటర్ల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, కానీ విశాఖపట్నం మరియు రాష్ట్ర ప్రజల జీవించే హక్కును, పర్యావరణాన్ని కాపాడటానికి చట్టాల కఠినమైన అమలు మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు కోసం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన సుమారు నూట అరువై ఎకరాల భూమిని అడవివరం సర్వే నెంబర్ ఇరవై ఐదులో నూట యాభై మూడు ఎకరాలు, ముదసలోవ సర్వే నెంబర్ ఇరవై ఆరులో ఏడు ఎకరాలు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషనర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ముప్పై సంవత్సరాల లీజుకు కేటాయించినప్పటికీ, కేవలం పదకొండు సంవత్సరాల లీజు మాత్రమేనని ప్రభుత్వం తప్పుడు వాదనలు చేస్తూ వస్తోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ చట్టం 1908 సెక్షన్ 17 మరియు బదిలీ ఆస్తుల చట్టం 1882 సెక్షన్ 107 ప్రకారం ఎలాంటి రిజిస్టర్డ్ లీజు లేదా సబ్-లీజు డీడ్ లేకుండానే ముందస్తు స్వాధీనం ఇవ్వడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన విమర్శించారు.

Related News Desk పాటూరు జడ్పీ హైస్కూల్ చైర్మన్‌గా ఎన్నికైన డేవిడ్ కళ్యాణ్ రాజ్ సన్మానం… పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన యల్లటూరు శ్రీనివాసరాజు

ఈ ప్రాజెక్టు మూడు వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉండటంతో కేటగిరీ-ఏ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం చేత మదింపు చేయబడాలని, అయితే ప్రాజెక్ట్ నివేదికలలో నీరు మరియు విద్యుత్ వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను గోప్యంగా ఉంచారని అఫిడవిట్‌లో ఎత్తిచూపారు. గౌరవ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రాజెక్ట్ సైట్‌లో చెట్ల నరికివేత మరియు నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న మధ్యంతర దరఖాస్తుపై అత్యవసర ఉత్తర్వులు జారీ చేసి, నూట అరువై ఎకరాల దేవాదాయ భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టును కోరామని, రాబోయే అక్టోబర్ ఐదవ తేదీన జరిగే విచారణలో ఈ అంశాలపై విస్తృత వాదనలు జరగనున్నాయని బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు.

Slug: bolisetty-satyanarayana-files-affidavit-ap-high-court-vizag-data-center