బ్రేకింగ్ న్యూస్
సేవే లక్ష్యం.. విజయమే చిరునామా: అమెరికా వ్యాపారవేత్త గంగిపాముల భాస్కర్‌కు అఖిల భారత చిరంజీవి యువత ఘన సత్కారం.. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారుడిగా ప్రశంస!బంటుమిల్లిలో దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యల దుమారం: టీడీపీ నేత తీరుపై మండిపడ్డ ఎస్.వి. బాబు సమ్మెట.. ఎమ్మెల్యే మౌనాన్ని నిలదీస్తూ ఆగ్రహం!అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్: రామానగరంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరిక.. పసుపు కండువా కప్పి ఆహ్వానించిన ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు!పామర్రు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు.. రూ. 1.88 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజామచిలీపట్నం మార్కెట్ యార్డ్ బోర్డు సమావేశం.. సౌత్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ శాఖాధికారికి విజ్ఞప్తిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా రామకృష్ణాపురంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభంకృష్ణా జిల్లా పోలీస్ శాఖకు మరో ప్రత్యేక శ్వానం ‘రీటా’ రాక.. పది నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న బెల్జియన్ మాలినోయిస్స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పలాయనం.. కోర్టుల మాటున దాక్కుంటున్నారని జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ధ్వజంకోడూరు మండలం రామకృష్ణాపురంలో నూతన బ్యాంక్ ఆఫ్ ఇండియా భవన ప్రారంభం.. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర’ రాష్ట్రస్థాయి అవార్డు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం స్వీకరణసేవే లక్ష్యం.. విజయమే చిరునామా: అమెరికా వ్యాపారవేత్త గంగిపాముల భాస్కర్‌కు అఖిల భారత చిరంజీవి యువత ఘన సత్కారం.. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారుడిగా ప్రశంస!బంటుమిల్లిలో దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యల దుమారం: టీడీపీ నేత తీరుపై మండిపడ్డ ఎస్.వి. బాబు సమ్మెట.. ఎమ్మెల్యే మౌనాన్ని నిలదీస్తూ ఆగ్రహం!అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్: రామానగరంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరిక.. పసుపు కండువా కప్పి ఆహ్వానించిన ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు!పామర్రు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు.. రూ. 1.88 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజామచిలీపట్నం మార్కెట్ యార్డ్ బోర్డు సమావేశం.. సౌత్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వ్యవసాయ శాఖాధికారికి విజ్ఞప్తిమచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా రామకృష్ణాపురంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభంకృష్ణా జిల్లా పోలీస్ శాఖకు మరో ప్రత్యేక శ్వానం ‘రీటా’ రాక.. పది నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న బెల్జియన్ మాలినోయిస్స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ పలాయనం.. కోర్టుల మాటున దాక్కుంటున్నారని జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ధ్వజంకోడూరు మండలం రామకృష్ణాపురంలో నూతన బ్యాంక్ ఆఫ్ ఇండియా భవన ప్రారంభం.. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర’ రాష్ట్రస్థాయి అవార్డు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం స్వీకరణ
ఆంధ్ర

ముదినేపల్లిలో ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.. ఉపాధ్యాయులను సత్కరించిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్

kamineni-srinivas-teachers-day-celebrations-mudinepalli
ముదినేపల్లిలో ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.. ఉపాధ్యాయులను సత్కరించిన ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అమూల్యమని, ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన సంస్కృతిలో భాగమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ముదినేపల్లి మండలం ముదినేపల్లిలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మండలంలోని పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారికి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రతి గొప్ప వ్యక్తి వెనుక కచ్చితంగా ఒక గురువు హస్తం ఉంటుందని, పురాణ కాలం నుంచి కూడా మన దేశంలో గురువులకు అత్యున్నత స్థానం కల్పించామని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అయితే నేటి సమాజంలో కొంతమంది గురువుల పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు గురువులను గౌరవించడం మరచిపోయి అవమానించడం, అవహేళన చేయడం, కొన్ని చోట్ల దాడులకు పాల్పడటం అత్యంత బాధాకరమని అన్నారు. ఉపాధ్యాయ వృత్తికి భంగం వాటిల్లేలా ప్రవర్తించే ధోరణులు మారాలని, గురువులను సముచిత రీతిలో గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

Related News Desk బంటుమిల్లిలో దళిత మహిళపై అనుచిత వ్యాఖ్యల దుమారం: టీడీపీ నేత తీరుపై మండిపడ్డ ఎస్.వి. బాబు సమ్మెట.. ఎమ్మెల్యే మౌనాన్ని నిలదీస్తూ ఆగ్రహం!

ఇదే సందర్భంగా ఇటీవల డీఎస్సీ వ్యవహారంలో వైయస్సార్సీపీ అనుసరించిన తీరు సిగ్గుచేటని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఉపాధ్యాయులను అవమానించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొత్తా నాగేంద్ర కుమార్, ఎన్డీయే నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Slug: kamineni-srinivas-teachers-day-celebrations-mudinepalli