జన గళం కృత్తివెన్ను బ్యూరో: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా పెడన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం మునిపెడ దళితవాడలో వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా రూ.7 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైట్లను ఆయన ప్రారంభించారు. రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనతో పల్లెలకు మహర్దశ పడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమ గ్రామంలో సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు మునిపెడ దళితవాడ గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ, జనసేన శ్రేణులు, పంచాయతీ అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పల్లె పండుగ 3.0’తో గ్రామాల ప్రగతి: మునిపెడలో రూ.7 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్!
Slug: pedana-mla-kagitha-krishna-prasad-lays-foundation-cc-road-palle-panduga-munipeda-kruthivennu
