జన గళం పెడన బ్యూరో: పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. స్థానిక శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి కూటమి నాయకులు బంటుమిల్లి, పెడన, కృత్తివెన్ను మండలాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. బంటుమిల్లి మండల పరిధిలోని కొర్లపాడు, సాయినగర్, బాసినంపాడు గ్రామాల్లో బీటీ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెడన మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక వర్క్‌షాప్‌లో నాయకులు పాల్గొని దిశానిర్దేశం చేశారు. అనంతరం కృత్తివెన్ను మండలం మునిపెడలో మేరీమాత ఆలయానికి విద్యుత్ లైన్ ప్రారంభించడంతో పాటు సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అలాగే మాట్లాం–గోవిందరాజుల దిబ్బ బీటీ రోడ్డు పనులకు, లక్ష్మీపురంలో రూ.1.47 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి కూటమి శ్రేణులు ఘనంగా శంకుస్థాపనలు నిర్వహించారు.
పెడన నియోజకవర్గంలో అభివృద్ధి జాతర: ‘పల్లె పండుగ 3.0’ పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి శ్రీకారం చుట్టిన కూటమి నేతలు!
Slug: pedana-mla-kagitha-krishna-prasad-palle-panduga-roads-phc-inaugurations-bantumilli-kruthivennu
