హైదరాబాద్లోని హైటెక్స్ (Hitex) వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న “సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్” కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఛాంబర్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ, వ్యాపార-వాణిజ్య రంగాల విస్తరణపై ఆయన సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమ్మిట్ ప్రధాన ఉద్దేశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ఛాంబర్ ప్రతినిధులు శ్రీ పి.వి. రావు, శ్రీ టి.వి.ఎన్. రావు, శ్రీ ఎ.వి. రత్నం, మాజీ ఎమ్మెల్యే శ్రీ సామినేని ఉదయభాను, శ్రీ బండారు నరసింహారావు, శ్రీ ఒ. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
