జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పదవుల రిజర్వేషన్లను అధికారికంగా ఖరారు చేసింది. రాబోయే రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల జడ్పీ చైర్మన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా జడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- అనకాపల్లి – బీసీ మహిళ
- అనంతపురం – బీసీ
- అన్నమయ్య – జనరల్
- అల్లూరి సీతారామరాజు – ఎస్టీ
- బాపట్ల – జనరల్ మహిళ
- చిత్తూరు – జనరల్ మహిళ
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ – ఎస్సీ మహిళ
- తూర్పుగోదావరి – జనరల్ మహిళ
- ఏలూరు – జనరల్ మహిళ
- గుంటూరు – ఎస్సీ మహిళ
- కాకినాడ – జనరల్ మహిళ
- కృష్ణా – జనరల్ మహిళ
- కర్నూలు – బీసీ
- మార్కాపురం – జనరల్
- నంద్యాల – జనరల్
- ఎన్టీఆర్ – ఎస్సీ
- పల్నాడు – జనరల్ మహిళ
- పోలవరం – ఎస్టీ మహిళ
- ప్రకాశం – ఎస్సీ
- పార్వతీపురం మన్యం – ఎస్టీ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతం కావడంతో రాజకీయ వర్గాల్లో మరియు ఆశావహులలో ఎన్నికల సందడి ఒక్కసారిగా పెరిగింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థులు తమ రాజకీయ సమీకరణాలను వేగవంతం చేస్తున్నారు. త్వరలోనే ఎన్నికల సంఘం నుంచి పూర్తిస్థాయి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
