బ్రేకింగ్ న్యూస్
నందిగామ జనసేన సమన్వయకర్తగా పూజారి రాజేష్.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం​గన్నవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి భారీ భరోసా.. రూ. 60.21 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన యార్లగడ్డ వెంకట్రావునిర్మాణ రంగ దిగ్గజం డాక్టర్ ఏవీఎస్ రాజు అస్తమయం.. పద్మశ్రీ పురస్కార గ్రహీత మృతికి ప్రముఖుల సంతాపంఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణా నదిపై రెండు కేబుల్ వంతెనలు.. మున్నలూరు వద్ద రూపుదిద్దుకోనున్న భారీ నిర్మాణంకరువు ఎన్యుమరేషన్‌లో వెదజల్లు పంటలనూ చేర్చాలి.. రూ. 2 లక్షల రుణమాఫీపై రైతు సంఘం గళంతిరువూరు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల గెజిట్ విడుదల.. 28 వార్డుల కేటాయింపు వివరాలు ఇలాపోరంకిలో పెనమలూరు బీజేపీ సమరశంఖం.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై సర్వసభ్య సమావేశంకృత్తివెన్నులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. శ్రేణులకు ఉప్పాల రాము దిశానిర్దేశంఏపీ స్థానిక సమరానికి మోగనున్న నగారా.. నేడు ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్ఈసీఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు: పూర్తి వివరాలునందిగామ జనసేన సమన్వయకర్తగా పూజారి రాజేష్.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం​గన్నవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి భారీ భరోసా.. రూ. 60.21 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన యార్లగడ్డ వెంకట్రావునిర్మాణ రంగ దిగ్గజం డాక్టర్ ఏవీఎస్ రాజు అస్తమయం.. పద్మశ్రీ పురస్కార గ్రహీత మృతికి ప్రముఖుల సంతాపంఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణా నదిపై రెండు కేబుల్ వంతెనలు.. మున్నలూరు వద్ద రూపుదిద్దుకోనున్న భారీ నిర్మాణంకరువు ఎన్యుమరేషన్‌లో వెదజల్లు పంటలనూ చేర్చాలి.. రూ. 2 లక్షల రుణమాఫీపై రైతు సంఘం గళంతిరువూరు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల గెజిట్ విడుదల.. 28 వార్డుల కేటాయింపు వివరాలు ఇలాపోరంకిలో పెనమలూరు బీజేపీ సమరశంఖం.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై సర్వసభ్య సమావేశంకృత్తివెన్నులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.. శ్రేణులకు ఉప్పాల రాము దిశానిర్దేశంఏపీ స్థానిక సమరానికి మోగనున్న నగారా.. నేడు ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్ఈసీఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ (జడ్పీ) చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు: పూర్తి వివరాలు
అమరావతి

​గన్నవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి భారీ భరోసా.. రూ. 60.21 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు

​గన్నవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి భారీ భరోసా.. రూ. 60.21 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండంత అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన అరవై ఏడు మంది లబ్ధిదారులకు మొత్తం అరవై లక్షల ఇరవై ఒక్క వేల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.

​ఈ నిధుల కేటాయింపులో బాపులపాడు మండలానికి చెందిన పద్దెనిమిది మంది బాధితులకు రూ. 21,21,601, గన్నవరం మండలంలో పదిహేను మందికి రూ. 8,11,515, ఉంగుటూరు మండలంలో పదమూడు మందికి రూ. 15,70,156, విజయవాడ రూరల్ మండలంలో ఇరవై మందికి రూ. 14,64,096 అందజేయగా, ఇతర నియోజకవర్గానికి చెందిన మరో బాధితునికి రూ. 53,600 సహాయం అందించారు. కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసరపు చిన్ని కుటుంబానికి ఆరు లక్షల రూపాయల పరిహారం అందేలా యార్లగడ్డ ప్రత్యేక చొరవ చూపారు. అంతేకాకుండా తీవ్రమైన ప్రాణాంతక వ్యాధితో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల్సిన మేడేపల్లి జ్యోతి పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి పది లక్షల రూపాయల అత్యవసర ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించారు.

Related News Desk నందిగామ జనసేన సమన్వయకర్తగా పూజారి రాజేష్.. పార్టీ శ్రేణుల ఘన స్వాగతం

​చెక్కుల పంపిణీ అనంతరం కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా ఆలకించి, వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రతి గడపకూ చేరుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.