ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్‌కు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిగా ఆయన ప్రశంసించారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్ర పర్యాటక రంగం, సాంస్కృతిక వైభవం నలుదిశలా విస్తరించాలని ఆకాంక్షించారు. దుర్గాభవాని అమ్మవారి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, విజయవంతమైన ప్రజాజీవితాన్ని కొనసాగించాలని ప్రార్థించారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత అమ్మిశెట్టి వాసు
Slug: ammisetti-vasu-birthday-wishes-to-ap-minister-kandula-durgesh-janasena
