ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలికి కౌంటింగ్ విధుల హుకుం
లింగవరం యూపీ హైస్కూల్ ఉపాధ్యాయురాలు మహబూబ్ బిపై అధికారుల ఒత్తిడి…
ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా విధులకు హాజరు కావాలని ఆదేశాలు..
సెలవు కావాలంటే కలెక్టర్‌ను ప్రత్యక్షంగా కలవాలని ఉన్నతాధికారుల సూచన
తన చేతుల్లో ఏమీ లేదంటున్న గుడివాడ ఎంఈఓ రజని
విధులకు రాకపోతే కోర్టు కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక…
నడవలేని స్థితిలో కుర్చీలో కూర్చుని, అన్నయ్య, బంధువుల సాయంతో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఉపాధ్యాయురాలు
కౌంటింగ్ కేంద్రంలోని యూనివర్సిటీలో కలెక్టర్ డీకే. బాలాజీని కలిసి సెలవు తీసుకున్న మహబూబ్ బి….
గాయాలతో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయురాలిపై అధికారుల కఠిన వైఖరిపై విమర్శలు…
మానవతా దృక్పథం లేకుండా వ్యవహరించిన అధికారుల తీరుపై ఆగ్రహం
