జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అచ్చయ్యవారిపాలెం పంచాయతీ మాజీ సర్పంచ్ మరియు కేడీసీసీ (KDCC) బ్యాంకు మాజీ డైరెక్టర్ తాతా ఉమా బ్రహ్మ విష్షు మహేశ్వరరావు (పెద్ద బాబు) గారి సతీమణి తాతా సువర్ణ త్రిపుర సుందరి (పండు) గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న స్థానిక రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సువర్ణ త్రిపుర సుందరి గారు తన పదవీకాలంలో గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, మృదుస్వభావిగా అందరితోనూ కలివిడిగా ఉంటూ ప్రజాసేవలో ముందుండేవారని స్థానికులు స్మరించుకున్నారు. ఆమె అకాల మరణం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు మరియు గ్రామస్తులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
సువర్ణ త్రిపుర సుందరి గారి అంతిమ యాత్ర రేపు ఉదయం జింజేరు గౌడపాలెంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొని నివాళులర్పించనున్నారు.
Slug: achayyapalem-former-sarpanch-tata-suvarna-tripura-sundari-demise
