కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని చెరుకుమిల్లి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా చెరుకుమిల్లి ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అధికారిక అభ్యర్థినిగా బరిలోకి దిగిన యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.ఎన్నికల నిబంధనావళికి అనుగుణంగా ఆమె సమర్పించిన అఫిడవిట్లు, ధ్రువపత్రాలు, నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. చట్టబద్ధమైన అన్ని అంశాలు సక్రమంగా ఉండటంతో ఆమె నామినేషన్ పత్రాలను అధికారులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పరిశీలన ఘట్టం విజయవంతంగా పూర్తి కావడంతో చెరుకుమిల్లి గ్రామ పరిధిలోని జనసేన, కూటమి పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గ్రామీణ ప్రాంత సమగ్ర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేసి యర్రంశెట్టి నాగ శ్రీదేవిని అత్యధిక ఆధిక్యంతో గెలిపించేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు కార్యాచరణ ప్రారంభించారు
చెరుకుమిల్లి ఎంపీటీసీ ఎన్నికలు – జనసేన పార్టీ అభ్యర్థిని యర్రంశెట్టి నాగ శ్రీదేవి నామినేషన్ పత్రాలు సక్రమం
