బ్రేకింగ్ న్యూస్
కౌతవరం ఫీడర్ బ్రేక్‌డౌన్: చెరుకుమిల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో రాత్రి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం!విశాఖ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దేవదాయ భూముల కేటాయింపులో ఉల్లంఘనలు బొలిశెట్టి సత్యనారాయణ సంచలన అఫిడవిట్పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గురువారం పర్యటన షెడ్యూల్ పింఛన్ల పంపిణీ, ప్రజా దర్బార్ నిర్వహణపెడన జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన మాగంటి సతీష్ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వక భేటీచింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు నాగులగూడెం గ్రామ ప్రజల కృతజ్ఞతలు దశాబ్దాల రోడ్డు సమస్య పరిష్కారంబందరు కళా నైపుణ్యానికి సీఎం ఫిదా: మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబుకు ‘శిల్ప’ బ్రాండ్ విగ్రహాలు బహూకరణ!కొమాళ్ళపూడి పీఏసీఎస్ మహాజనసభ నిర్వహణ రూ. 17 కోట్ల టర్నోవర్‌తో అభివృద్ధి బాటలో సంఘం చైర్మన్ కూనసాని నాగబాబు వెల్లడిజగ్గయ్యపేటలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జయప్రద ఫౌండేషన్ ప్రత్యేక జాబ్ డ్రైవ్ చైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ పరిశీలనTitle: ప్రజలపై ధరల భారం తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విజయవాడలో రాయితీ ఉల్లిపాయల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం అభివృద్ధిని అడ్డుకున్న గత పాలకులపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహంకౌతవరం ఫీడర్ బ్రేక్‌డౌన్: చెరుకుమిల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో రాత్రి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం!విశాఖ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్ దేవదాయ భూముల కేటాయింపులో ఉల్లంఘనలు బొలిశెట్టి సత్యనారాయణ సంచలన అఫిడవిట్పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గురువారం పర్యటన షెడ్యూల్ పింఛన్ల పంపిణీ, ప్రజా దర్బార్ నిర్వహణపెడన జడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన మాగంటి సతీష్ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వక భేటీచింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు నాగులగూడెం గ్రామ ప్రజల కృతజ్ఞతలు దశాబ్దాల రోడ్డు సమస్య పరిష్కారంబందరు కళా నైపుణ్యానికి సీఎం ఫిదా: మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబుకు ‘శిల్ప’ బ్రాండ్ విగ్రహాలు బహూకరణ!కొమాళ్ళపూడి పీఏసీఎస్ మహాజనసభ నిర్వహణ రూ. 17 కోట్ల టర్నోవర్‌తో అభివృద్ధి బాటలో సంఘం చైర్మన్ కూనసాని నాగబాబు వెల్లడిజగ్గయ్యపేటలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జయప్రద ఫౌండేషన్ ప్రత్యేక జాబ్ డ్రైవ్ చైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ పరిశీలనTitle: ప్రజలపై ధరల భారం తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం విజయవాడలో రాయితీ ఉల్లిపాయల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం అభివృద్ధిని అడ్డుకున్న గత పాలకులపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం
ఆంధ్ర

గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం అభివృద్ధిని అడ్డుకున్న గత పాలకులపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం

avanigadda-mla-mandali-buddha-prasad-inaugurates-rural-health-centers-ghantasala
గ్రామీణ ఆరోగ్య కేంద్రాల ప్రారంభం అభివృద్ధిని అడ్డుకున్న గత పాలకులపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించాల్సిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను గత పాలకులు అసంపూర్తిగా వదిలేశారని, కూటమి ప్రభుత్వంలో ఆ భవనాలన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. ఘంటసాల మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, పాపవినాశనం, తెలుగురావుపాలెం మరియు చిట్టూర్పు గ్రామాల్లో ముప్పై ఆరు లక్షల రూపాయల చొప్పున వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులు వచ్చినా సంకుచిత రాజకీయాల కారణంగా పనులు నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వంలో కోటికి పైగా నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశామని తెలిపారు.

నియోజకవర్గంలో ఐదు కోట్లకు పైగా నిధులతో పద్నాలుగు నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను నిర్మించామని, శంకుస్థాపన చేసిన తొమ్మిది నెలల్లోనే వీటిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులు గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలను కూడా అసంపూర్తిగా మిగిల్చారని, వాటిని పూర్తి చేసేందుకు భారీగా నిధులు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో వందలాది సీసీ మరియు తారు రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో చల్లపల్లి ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు మరియు నియోజకవర్గంలో మరిన్ని రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Related News Desk పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గురువారం పర్యటన షెడ్యూల్ పింఛన్ల పంపిణీ, ప్రజా దర్బార్ నిర్వహణ

రాజకీయాలను ఎన్నికల వరకే చూస్తానని, గెలిచాక ప్రజలంతా సమానమేనని భావించి నిస్వార్థంగా అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తానని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. అయితే కొందరిలో రాజకీయ పిచ్చి ముదిరిందని, వారి వైఖరి మారకపోతే తగిన మందు వేయడం ఖాయమని హెచ్చరించారు. క్షుద్ర రాజకీయాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, మంచి పనులకు మాత్రమే తన పూర్తి సహకారం ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, జనసేన మండల అధ్యక్షులు కోన రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Slug: avanigadda-mla-mandali-buddha-prasad-inaugurates-rural-health-centers-ghantasala