బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
ఆంధ్ర

ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ బాధితుల మందుల కొరతపై స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయం.. రెండు గంటల్లోనే పరిష్కారం

dy-cm-office-resolves-kidney-patients-medicine-issue-in-ntr-district
ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ బాధితుల మందుల కొరతపై స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయం.. రెండు గంటల్లోనే పరిష్కారం

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిడ్నీ వ్యాధి బాధితులు ఎదుర్కొంటున్న మందుల కొరత సమస్యపై పత్రికల్లో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం కార్యాలయం శరవేగంగా స్పందించింది. ఏ కొండూరు పీహెచ్‌సీలో రోగులకు మందులు అందడం లేదనే వార్త ప్రచురితం కావడంతో, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సూచన మేరకు తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని వెంటనే ఏపీఎండీసీఎస్ చైర్మన్, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ మరియు స్థానిక వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా లేఖ ద్వారా సమాచారాన్ని అందించారు.

సమాచారాన్ని అందుకున్న ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పేషీ అత్యంత వేగంగా స్పందించి కేవలం రెండు గంటల వ్యవధిలోనే సమస్యకు తగిన పరిష్కారం చూపింది. డిప్యూటీ సీఎం కార్యాలయ ఓఎస్డీ, ఏపీ ప్రభుత్వ అదనపు కార్యదర్శి కే. వెంకటకృష్ణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ సిబ్బందితో మాట్లాడి, మంగళవారం నుంచి అన్ని రకాల మందులు ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కిడ్నీ వ్యాధి బాధితులకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. బాధితులు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం నుంచి తగిన భరోసా లభించిందని తెలిపారు.

Related News Desk భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

ఇదే సందర్భంగా ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, జలజీవన్ మిషన్ ద్వారా కిడ్నీ వ్యాధి బాధితుల ఆవాసాలకు శుద్ధి చేసిన కృష్ణా జలాలను ప్రతి గ్రామంలోని ముఖ్య కూడళ్లలో ట్యాప్‌ల ద్వారా అందించాలని కోరుతూ మనుబోలు శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అత్యవసర ప్రజా సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, ఓఎస్డీ కే. వెంకటకృష్ణకు తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు.

Slug: dy-cm-office-resolves-kidney-patients-medicine-issue-in-ntr-district