బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
అమరావతి

మచిలీపట్నంలో స్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి… కలెక్టర్ డీకే బాలాజీకి జనసేన నగర అధ్యక్షుడు గడ్డంరాజు విజ్ఞప్తి

machilipatnam-burial-grounds-development-gaddam-raju
మచిలీపట్నంలో స్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి… కలెక్టర్ డీకే బాలాజీకి జనసేన నగర అధ్యక్షుడు గడ్డంరాజు విజ్ఞప్తి

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్మశాన వాటికల దుర్భర పరిస్థితిపై జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు ప్రత్యేక దృష్టి సారించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ నవీన్‌ను కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నంలోని వివిధ స్మశాన వాటికలను స్వయంగా పరిశీలించి, అక్కడ కనీస మౌలిక వసతులు కల్పించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో ఆయన కోరారు.

నగరంలోని అనేక స్మశాన వాటికలు కనీస వసతులకు నోచుకోకుండా అధ్వాన్నంగా మారాయని గడ్డంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమ సంస్కారాలు నిర్వహించే చోట కనీసం తాగునీరు, షెడ్లు, పితృదేవతలకు క్రతువు నిర్వహించుకునేందుకు తగిన సదుపాయాలు కూడా లేవని తెలిపారు. సరైన నిర్వహణ లేక అపరిశుభ్ర వాతావరణం నెలకొని తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోందని, అంతేకాకుండా అక్కడికి చేరుకోవడానికి కనీసం రహదారులు కూడా లేని దుస్థితిలో ఉన్నాయని ఆయన వివరిస్తూ జేసీ దృష్టికి తీసుకువెళ్లారు.

Related News Desk భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

జనసేన నేత విజ్ఞప్తిపై జేసీ నవీన్ సానుకూలంగా స్పందించినట్లు గడ్డంరాజు పేర్కొన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులను పిలిచి నగరంలోని స్మశాన వాటికలను పరిశీలించి తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు జేసీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గతంలో నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పాలనా కాలంలో అన్యాక్రాంతమైన స్మశాన వాటికలను పరిరక్షించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మానవ జీవితంలో చివరి మజిలీ అయిన స్మశాన వాటికలను ప్రస్తుత ప్రత్యేక అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పరుస్తారన్న పూర్తి ఆశాభావాన్ని గడ్డంరాజు వ్యక్తం చేశారు.

Slug: machilipatnam-burial-grounds-development-gaddam-raju