జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల ప్రభావంతో ఉత్తర కోస్తా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) పూర్తి అప్రమత్తమైంది. ఈదురుగాలులు, వర్షాల కారణంగా స్తంభాలు కూలడం, విద్యుత్ తీగలు తెగిపడటం వంటి అత్యవసర సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక అత్యవసర కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.
ప్రజలు విద్యుత్ సంబంధిత సమస్యలు, అంతరాయాలపై ఫిర్యాదు చేయడానికి ఉచిత టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా కార్పొరేట్ కార్యాలయం 8331018762 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ప్రాంతాల వారీగా సంప్రదించాల్సిన అత్యవసర కంట్రోల్ రూమ్ వివరాలు:
- విశాఖపట్నం జోన్-1: 9490610019
- విశాఖపట్నం జోన్-2: 9849628880
- విశాఖపట్నం జోన్-3: 9491030722
- అనకాపల్లి: 9490610023, కశింకోట: 8333810597
- నర్సీపట్నం: 9491030723, పాడేరు: 9490610027
- శ్రీకాకుళం: 9701400865, టెక్కలి: 9490610050, పలాస: 08945241084, పాలకొండ: 8332843546
- విజయనగరం (టౌన్ & రూరల్): 9490610102, బొబ్బిలి: 9490610121
- పార్వతీపురం: 9398594750
- కాకినాడ: 9490610856, పెద్దాపురం: 9493178728, జగ్గంపేట: 9490610097
- రాజమహేంద్రవరం టౌన్: 9490610855, రాజమహేంద్రవరం రూరల్: 9490610859
- నిడదవోలు: 9493177540, అమలాపురం: 9490610101, కొత్తపేట: 9493178821, రంపచోడవరం: 8309771508
- ఏలూరు: 9440904037, జంగారెడ్డిగూడెం: 9491030712
- భీమవరం: 9490610143, తాడేపల్లిగూడెం: 9493177806, నరసాపురం: 7382050943
వర్షాల వేళ తెగిపడిన విద్యుత్ తీగలు, కూలిన స్తంభాల వద్దకు ప్రజలు వెళ్లకూడదని, ప్రమాదకర పరిస్థితులను గమనించిన వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు హెచ్చరించారు.
