జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, అనుచరులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మచిలీపట్నం సహా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగతంగా తమ ప్రియతమ నేతకు ప్రత్యేక జన్మదిన సందేశాలను పంపుతూ శుభాభినందనలు తెలిపారు.
బూరగడ్డ వేదవ్యాస్ ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలంగా అందిస్తున్న విశేష సేవలను, ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లి, నిరంతరం ప్రజా సేవలో ముందుండాలని బూరగడ్డ వేదవ్యాస్ యువసేన, ముమ్మడిశెట్టి వాసు యువసేన ప్రతినిధులు హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అభిమానులు రక్తదాన, సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు.
