జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ నగరంలోని 79 మరియు 80వ డివిజన్లలో జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం నాయకత్వంలో ఎన్నికల ప్రచారం వర్షంలోనూ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా విజయవాడ మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ (రాధా బాబు)ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
అదేవిధంగా 79వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గౌసియా, 80వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బెవర సూర్యమణిలను సైతం అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారంలో భాగంగా ప్రజలను అభ్యర్థించారు. ఎంత వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తూ ప్రచారాన్ని హోరెత్తించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కుప్పాల శీను, ఉపాధ్యక్షులు నల్ల బెనర్జీ, ఆనాపు దుర్గారావు, బాలాజీ, రాజేష్ మరియు డివిజన్ కార్యకర్తలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
