జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. 2014 నుంచి జనసేన పార్టీ కోసం రామ్ తాళ్లూరి గారు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉంటూ ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ, కులమతాలకు అతీతంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధన కోసం ఒక సాధారణ కార్యకర్తలా పనిచేసే గొప్ప మనసున్న వ్యక్తి అని ప్రశంసించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూనే, ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ విస్తరణకు విశేష కృషి చేస్తున్నారన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగి, జనసైనికులు, వీరమహిళలకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచే నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఆయనపై సదా ఉండాలని, పార్టీలో మరియు ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అమ్మిశెట్టి వాసు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
