జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సినీ నిర్మాత శ్రీ రామ్ తాళ్లూరి జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ సంస్థాగత బలోపేతానికి నిశ్శబ్ద వ్యూహకర్తగా నిరంతరం శ్రమిస్తున్న నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధి శ్రీ రవణం స్వామినాయుడు రామ్ తాళ్లూరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీకి బలమైన వెన్నుదన్నుగా ఉంటూ, ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న రామ్ తాళ్లూరి నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రవణం స్వామినాయుడు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
