జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ క్షేత్రస్థాయిలో నిలబడతానని జనసేన పార్టీ నాయకుడు స్పష్టం చేశారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ఏనాడూ ప్రజలకు దూరం కాలేదని, డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ వారి పక్షాన బలంగా నిలబడ్డానని పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రస్థానంలో అధికారం కంటే ప్రజాసేవే పరమావధిగా భావించానని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో స్థానిక డివిజన్‌ను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన మోడల్ డివిజన్‌గా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యలను సమగ్రంగా పరిష్కరించడమే తన అంతిమ ధ్యేయమని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారి గళమై నిలుస్తానని, స్థానిక ప్రజల సంక్షేమం మరియు ప్రాంత ప్రగతి కోసం అంకితభావంతో పనిచేస్తానని పునరుద్ఘాటించారు.
