జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రముఖ నాయకులు శ్రీ పోతిన వెంకట మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తాజా పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డిని పోతిన మహేష్ కలవడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ప్రజా సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఈ భేటీలో ముచ్చటించినట్లు సమాచారం.
