జన గళం విజయవాడ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత శ్రీమతి సుస్మిత కొణిదెల విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేయగా, ఆమె అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, అందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఇంద్రకీలాద్రిపై సుస్మిత కొణిదెల: దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు!
Slug: sushmitha-konidela-chiranjeevi-daughter-visits-kanaka-durga-temple-vijayawada
