జన గళం తిరువూరు బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయి రాజకీయ, సామాజిక సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో-ఆర్డినేషన్ కమిటీకి అందించేందుకు గాను, జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీలో అసెంబ్లీ సమన్వయకర్తలుగా మనుబోతుల వెంకట శ్రీనివాసరావు, రావుల రాజేంద్ర ప్రసాద్, పగడాల లక్ష్మణరావు నియమితులయ్యారు. వీరితో పాటు 32 మందితో కూడిన ‘నిర్వాహక్ దళ్’, ఐదుగురు సభ్యులతో కూడిన ‘సపోర్ట్ టీం’ను సైతం పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సమన్వయకర్తగా నియమితులైన శ్రీ రావుల రాజేంద్ర ప్రసాద్‌కు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
తిరువూరు అసెంబ్లీ స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటన: సమన్వయకర్తగా రావుల రాజేంద్ర ప్రసాద్ నియామకం!
Slug: tiruvuru-assembly-janasena-local-body-elections-coordination-committee-announced-ravula-rajendra-prasad
