జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: 53వ డివిజన్ పరిధిలోని బిఆర్‌పి రోడ్డు వద్ద తీవ్రంగా దెబ్బతిని ప్రమాదకరంగా మారిన మెయిన్ అవుట్‌ఫాల్ రైలింగ్ మరియు రోడ్డు నిర్మాణ పనులను స్థానిక జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు పరిశీలించారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో రోడ్డు మరియు రైలింగ్ దెబ్బతినడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన నాయకులు తక్షణ చర్యలు చేపట్టేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో ఒక వైపు పనులను వేగవంతంగా ప్రారంభించారు.
డివిజన్ ప్రజల సంక్షేమం మరియు రక్షణే ధ్యేయంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, నాణ్యతా ప్రమాణాలను విధిగా పాటించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. పనుల్లో ఎటువంటి అలసత్వానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ కేసినేని చిన్ని గారి పూర్తి సహకారంతోనే ఈ పనులు సాధ్యమవుతున్నాయని మహాదేవు అప్పాజీరావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డివిజన్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Slug: 53rd-division-brp-road-development-works-mahadevu-appajirao
