జన గళం విజయవాడ డెస్క్: భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్ల తొలగింపు ప్రక్రియకు పాల్పడుతున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓటు హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేడు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈరోజు (మంగళవారం, సెప్టెంబర్ 29) మధ్యాహ్నం 3:00 గంటలకు విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలనుకొండ శివాజీ మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటు హక్కును కాలరాసేలా సాగుతున్న కుట్రలను, ఎన్నికల కమిషన్ ఏకపక్ష వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఆధారాలతో సహా బహిర్గతం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు రక్షణ కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ భేటీలో వివరించనున్నారు.
