బ్రేకింగ్ న్యూస్
నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు జనసేన భరోసా: ఆస్పత్రుల్లో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను.. వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ!సామాజిక ఉద్యమనేత గాళ్ళ సుబ్రహ్మణ్యంకు ఘన నివాళి: కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేన నేత నెరుసు కృష్ణ ఆంజనేయులు!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కీలక చర్చలు.. పీఆర్పీ నాటి జ్ఞాపకాలు నెమరువేత!స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మం: 33 శాతం వాటా లెక్కలతో జనసేన కార్యకర్తల డిమాండ్.. మేయర్ నుంచి సర్పంచ్ వరకు స్పష్టమైన ప్రతిపాదనలు!అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల నియామకం: హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ!రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై వర్షపు నీటి సమస్యకు చెక్: అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తా పురుషోత్తం జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను!ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. రాత్రికి గేట్లు ఎత్తే అవకాశం!నెల్లూరులో జనసేన ‘లోకల్ వార్’.. ఆశావహుల క్యూ పెరుగుతోందా? శివశంకర్ భేటీలతో రాజకీయ వేడి!నేడు కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పర్యటన: ఉదయం వరహాపట్నంలో ప్రజా దర్బార్.. సాయంత్రం ఏలూరులో ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు!అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు జనసేన భరోసా: ఆస్పత్రుల్లో పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను.. వ్యక్తిగతంగా అండగా ఉంటామని హామీ!సామాజిక ఉద్యమనేత గాళ్ళ సుబ్రహ్మణ్యంకు ఘన నివాళి: కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేన నేత నెరుసు కృష్ణ ఆంజనేయులు!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధా ఆత్మీయ భేటీ: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కీలక చర్చలు.. పీఆర్పీ నాటి జ్ఞాపకాలు నెమరువేత!స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మం: 33 శాతం వాటా లెక్కలతో జనసేన కార్యకర్తల డిమాండ్.. మేయర్ నుంచి సర్పంచ్ వరకు స్పష్టమైన ప్రతిపాదనలు!అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల నియామకం: హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ!రామవరప్పాడు–ప్రసాదంపాడు జాతీయ రహదారిపై వర్షపు నీటి సమస్యకు చెక్: అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు!ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు కొత్తా పురుషోత్తం జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను!ప్రకాశం బ్యారేజీకి భారీ వరద.. రాత్రికి గేట్లు ఎత్తే అవకాశం!నెల్లూరులో జనసేన ‘లోకల్ వార్’.. ఆశావహుల క్యూ పెరుగుతోందా? శివశంకర్ భేటీలతో రాజకీయ వేడి!
రాజకీయం

ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు

Slug: pithapuram-fakruddin-palem-maisamma-tank-beautification-pawan-kalyan
ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను కేవలం నీటి వనరులుగా కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే సామాజిక ప్రదేశాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును ఆధునీకరించారు. సోమవారం పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అభివృద్ధి చేసిన చెరువు, వాకింగ్ ట్రాక్, పిల్లల పార్కును ప్రారంభించారు. పిఠాపురం పర్యటనలో చెరువుల అభివృద్ధితో పాటు పలు మౌలిక వసతుల కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నట్లు ముందుగా ప్రకటించారు.

ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును సుమారు రూ.73 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువు గట్టును బలోపేతం చేయడంతో పాటు గ్రీనింగ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల పార్కు, జెండా స్థూపం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం గ్రామ ప్రజలు నడక, వ్యాయామం చేసుకునేలా వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌ను రూపొందించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కును చిన్నారులతో కలిసి ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.

చెరువు పరిసరాల్లో ఉన్న భారీ వృక్షాలను పరిశీలించిన ఆయన వాటి వయసు, కొన్ని చెట్ల శాస్త్రీయ నామాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సుందరీకరణతో గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెరగడంతో పాటు ప్రజలకు విశ్రాంతి, వ్యాయామం, వినోదానికి అనువైన ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, నీటి వనరుల సంరక్షణకు సమన్వయంతో చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ఉద్దేశంగా పేర్కొన్నారు.

Related News Desk అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల నియామకం: హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షల వెల్లువ!

పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 11 చెరువుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన సహకారంతో సుమారు రూ.50 కోట్ల అంచనా వ్యయంతో 105 చెరువుల ఆధునీకరణ పనులు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇప్పటికే 26 చెరువుల పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపింది.

చెరువు ప్రారంభోత్సవానికి ముందు పవన్ కళ్యాణ్ మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. గ్రామ సచివాలయ భవనం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో నీటి వనరులు, రహదారులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వివిధ రంగాలకు సంబంధించిన సుమారు రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.