బ్రేకింగ్ న్యూస్
చోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవేచోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!పేద విద్యార్థి ఉన్నత చదువుకు మెగా యూత్ ఫోర్స్ భరోసా: ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత!ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జనసేన నేత అమ్మిశెట్టి వాసు!తుఫాను ప్రభావం.. కృష్ణాజిల్లాలో పాఠశాలలకు సెప్టెంబర్ 24న స్థానిక సెలవుమంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేతలు!ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనఅన్నమయ్య జిల్లా పోలీసులకు గుర్తింపు.. ‘ఈగల్ టీమ్’ సభ్యుడికి రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డుఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు, అమరావతికి రూ. 1,548 కోట్లుతీవ్ర వాయుగుండం ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
ఆంధ్ర

ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

​Slug: pawan-kalyan-sensational-speech-on-local-body-elections-seat-sharing-friendly-contest-janasena-cadre
ఇచ్చేవాడినే కానీ చేయి చాచి అడగను: స్థానిక ఎన్నికల్లో జనసేన బలం ఉన్నచోట పోటీ ఖాయం.. అవసరమైతే మైత్రీపూర్వక సమరానికి సై.. శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం!

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను సమరోత్సాహంతో సిద్ధం చేశారు. “నేను ఇచ్చేవాడినే కానీ తీసుకోవడం నాకు తెలియదు.. దానం చేయడమే నాకు తెలుసు. గుండె కవాటాలు తెరిచి ఇవ్వడమే తప్ప ఎన్నడూ చేయి చాచి అడగను” అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 15 శాతం సీట్లు అంటూ మాట్లాడటం చెప్పిన వాళ్ల పరిధిలోని అంశం కాదని కుండబద్దలు కొట్టారు. సార్వత్రిక ఎన్నికల సమీకరణాలు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరని స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉన్న ప్రతిచోటా జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని, తద్వారా పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శ్రేణులకు స్పష్టం చేశారు.

​ప్రతి చిన్న విషయానికి, సమస్యకు పవన్ కళ్యాణ్ కావాలంటే కుదరదని, ఎవరి స్థాయిలో స్థానిక సమస్యలను వాళ్లే పరిష్కరించుకోవాలని నేతలకు హితవు పలికారు. పంచాయతీ స్థాయిలో తలెత్తే సమస్యను స్థానిక సర్పంచ్ మాత్రమే పరిష్కరించగలరని గుర్తుచేశారు. “నా వెంట తిరగడం కాదు.. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి తిరగండి” అంటూ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కూటమిలో భాగంగా అవసరమైతే మైత్రీపూర్వక పోటీ (ఫ్రెండ్లీ కాంటెస్ట్) కూడా చేద్దామని పేర్కొన్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో 32 మందితో కమిటీ నియమించినట్లే, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన కమిటీలను కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ బలాబలాల అధ్యయనానికి రెండు మూడు రోజుల్లో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, తాము బలంగా ఉన్న స్థానాల నివేదికలను ఆ కమిటీకి సమర్పించాలని పిలుపునిచ్చారు. నాయకులు ఆసక్తిగా ఉన్నచోట, పార్టీకి పట్టున్న ప్రతి స్థానంలోనూ జనసేన బరిలో నిలవడం తథ్యమని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.

Related News Desk చోడవరం చెరకు రైతులకు కేబినెట్ తీపి కబురు: రూ. 28 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం.. సీఎం, డిప్యూటీ సీఎంలకు జనసేన ఎమ్మెల్సీ ధన్యవాదాలు!