జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేటలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్‌ను విజయనగరం అసెంబ్లీ పరిశీలకులు, కొప్పల వెలమ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీ పీజీవీ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఇరువురు నేతలు సుదీర్ఘంగా పలు సమకాలీన అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం, పెడన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతి మరియు తాజా రాజకీయ, సామాజిక పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ భేటీ అత్యంత ఆహ్లాదకరమైన, ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.
