జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కైకలూరు మాజీ శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) తనయుడు శ్రీ దూలం వినయ్ గురువారం కైకలూరులో పర్యటించారు. కైకలూరు దానగుడుం రోడ్డులో నిర్వహించిన కమ్మిలి శివకుమార్ మాతృమూర్తి దివంగత కమ్మిలి సుజాత దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా దివంగత సుజాత చిత్రపటానికి పూలమాలలు వేసి దూలం వినయ్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కమ్మిలి శివకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో దూలం వినయ్‌తో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
