బ్రేకింగ్ న్యూస్
కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!రబ్బరు చెప్పుల రాజకీయం అంటే ఏంటో చేసి చూపించిన పవన్ కళ్యాణ్: పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో సామాన్యులకే పట్టం.. చరిత్ర సృష్టించిన జనసేనాని మార్క్ రాజకీయం! (జన గళం పొలిటికల్ స్పెషల్ డెస్క్)జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!సేవాస్ఫూర్తికి నిదర్శనం: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 19వ సారి రక్తదానం చేసిన K.N.S. కళ్యాణ్ చక్రవర్తి.. ఇప్పటివరకు మొత్తం 59 సార్లు డొనేషన్! (జన గళం స్పెషల్ డెస్క్)జడ్పీటీసీ, ఎంపీటీసీ విజేతలతో ఎమ్మెల్యే రాము భేటీ…ప్రజా వేదికలో కూటమి విజేతల ఆత్మీయ సమావేశంరాజానగరం పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్: జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. సీతానగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం! (జన గళం ఎలక్షన్ డెస్క్)గ్రామ పంచాయతీ సమరం: సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్నారా?.. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణే.. వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనలివే! (జన గళం ఎలక్షన్ డెస్క్)విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత తులా రామలింగేశ్వరరావు: నరసాపురంలో ఘన సత్కారం! (జన గళం స్పెషల్ డెస్క్)జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌లను మర్యాదపూర్వకంగా కలిసిన కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావు! (జన గళం స్పెషల్ డెస్క్)కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ పీఠం ఎవరిది?: టీడీపీ సమీకరణాలు.. జనసేన పట్టు.. బీజేపీ డిమాండ్.. రంగంలోకి దిగిన అధిష్ఠానం.. IVRS సర్వేలు, సమన్వయ కమిటీలతో రాజకీయం రసవత్తరం! (జన గళం పొలిటికల్ బ్యూరో స్పెషల్ డెస్క్)
కృష్ణా జిల్లా

కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!

Slug: kruthivennu-mandal-sarpanch-ward-member-reservations-2026
కృత్తివెన్ను మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు.. 16 గ్రామ పంచాయతీల వివరాలు విడుదల!

జన గళం కృష్ణా జిల్లా డెస్క్:

కృష్ణా జిల్లా బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కృత్తివెన్ను మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలు విడుదలయ్యాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ రిజర్వేషన్ పట్టికలో మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవుల రిజర్వేషన్లతో పాటు వార్డుల వారీగా కేటాయింపులను పొందుపరిచారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆమోదంతో రూపొందించిన పట్టిక ప్రకారం సర్పంచ్ పదవుల రిజర్వేషన్లలో బీసీ మహిళ, బీసీ, ఎస్సీ, జనరల్ మహిళ, జనరల్ కేటగిరీలకు కేటాయింపులు ఉన్నాయి.

Related News Desk జైల్లో నుంచే వైసీపీ అభ్యర్థి సంచలన విజయం!

సర్పంచ్ పదవుల రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. చెరుకుమిల్లి – బీసీ మహిళ, చినగొల్లపాలెం – జనరల్ మహిళ, చినపాండ్రక – బీసీ, గరిశెపూడి – జనరల్ మహిళ, ఇంటేరు – జనరల్, కొమళ్లపూడి – బీసీ, కృత్తివెన్ను – జనరల్, లక్ష్మీపురం – బీసీ మహిళ, మట్లం – జనరల్ మహిళ, మునిపెడ – బీసీ, నీలిపూడి – బీసీ మహిళ, నిడమర్రు – జనరల్, పడతడిక – బీసీ మహిళ, పల్లెపాలెం – జనరల్, సీతనపల్లి – ఎస్సీ, యండపల్లి – జనరల్ మహిళగా కేటాయించారు.

మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 174 వార్డులు ఉన్నట్లు పట్టికలో పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల సంఖ్యను బట్టి రిజర్వేషన్లను కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలతో పాటు మహిళలకు కూడా వార్డుల వారీగా రిజర్వేషన్లు కల్పించారు.

రిజర్వేషన్ల వివరాలు విడుదల కావడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో ఎన్నికల సందడి క్రమంగా పెరుగుతోంది.