భీమవరం: స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల్లో కృష్ణా జిల్లా కలిదిండి మండల జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చిన్నబాబు) గారిని, ఏపీఐఐసీ (APIIC) డైరెక్టర్ మరియు కైకలూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త శ్రీ చెనమల్ల చంద్రశేఖర్ గారిని భీమవరంలోని జిల్లా అధ్యక్షుల కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కలిదిండి జడ్పీటీసీ శ్రీ నల్లగోపుల వెంకట చలపతిరావు గారిని శ్రీ కొటికలపూడి గోవిందరావు (చిన్నబాబు) గారు శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా కలిదిండి మండల పరిధిలోని గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
