జన గళం రాజంపేట డెస్క్: సమాజానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక డాక్టరేట్ అందుకున్న ప్రముఖులు శ్రీ కొండూరు శరత్ కుమార్ రాజు గారిని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాసరాజు గారు ఘనంగా సత్కరించారు.
రాజంపేటలోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించిన కొండూరు శరత్ కుమార్ రాజు గారి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి యల్లటూరు శ్రీనివాసరాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ రాజు గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. అనంతరం శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. ప్రజా సేవలో విశేష కృషి చేసి జాతీయ స్థాయిలో డాక్టరేట్ గౌరవం దక్కించుకోవడం రాజంపేట ప్రాంతానికే గర్వకారణమని కొనియాడారు. నిస్వార్థ సేవలతో గుర్తింపు పొందిన శరత్ కుమార్ రాజు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, జనసేన నాయకులు, శ్రేణులు పాల్గొని శరత్ కుమార్ రాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు.
