బ్రేకింగ్ న్యూస్
బ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాలబ్యాంకులో రూ.70 లక్షలు ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వైనం: పదేళ్ల జీతాన్ని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాచుకున్న వ్యక్తి.. పెళ్లి చేసుకుంటే డబ్బు పోతుందని ఒంటరిగానే ఉంటూ.. చివరకు టీబీ వ్యాధికి చికిత్స చేయించుకోలేక విషాదాంతం! (జన గళం స్పెషల్ డెస్క్)భారత తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమ కలిగిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు.కలియుగంలో అద్భుత భక్తి పారవశ్యం: పశ్చిమ బెంగాల్ నుండి శబరిమల వరకు 2,000 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార యాత్ర..బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ ముప్పు.. ‘అక్వాన్‌’గా మారే అవకాశంసృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నెక్స్ట్‌జెన్ స్కూల్ సైన్స్ ఫెయిర్:కలిదిండి నూతన జడ్పీటీసీ నల్లగోపుల వెంకట చలపతిరావుకు ఆత్మీయ శుభాకాంక్షలు:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మర్యాదపూర్వక భేటీబాపులపాడు పంచాయతీ సమరానికి జనసేన సై: సర్పంచ్ అభ్యర్థిగా చలమలశెట్టి అరుణ నామినేషన్ముచ్చర్లలో జనసేనలో చేరిన చీలి మోహనరావు, చీలి నాగబాల
రాజకీయం

ఉయ్యూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం కాదు, వృద్ధులు, వితంతువులకు సామాజిక భరోసా: మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్

uyyuru-ntr-bharosa-pensions-distribution-former-mlc-yvb-rajendra-prasad
ఉయ్యూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం కాదు, వృద్ధులు, వితంతువులకు సామాజిక భరోసా: మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్

జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉయ్యూరు పరిధిలోని 7 మరియు 15వ వార్డుల్లో అక్టోబర్ 1వ తేదీన జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ శ్రీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు మరియు దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత వారి జీవితాలకు గొప్ప సామాజిక భరోసానిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు. పెన్షన్ అందుకునే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే నమ్మకం కల్పించడమే ‘ఎన్టీఆర్ భరోసా’ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి నెల మొదటి తేదీనే క్రమం తప్పకుండా తెల్లవారుజామునే పింఛన్లు అందజేయడం వల్ల నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక ఊరట కలుగుతోందని తెలిపారు.

Related News Desk పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ

కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమానికి మాత్రమే పరిమితం కాకుండా, సంక్షేమం – అభివృద్ధి అనే రెండు కళ్లతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తోందని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి బృహత్ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మాజీ చైర్మన్ శ్రీ జంపాన పూర్ణచంద్రరావు, సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ శ్రీ జంపన శ్రీనివాస్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సయ్యద్ అజ్మతుల్లా, కౌన్సిలర్ శ్రీమతి వడుపు లక్ష్మి, టీడీపీ నాయకులు వడుపు కార్తీక్, తిరుపతిరావు, చింతయ్య, నీనావాత్ రవి, ఆసిఫ్, సయ్యద్ జబి, శ్రీకాంత్, బాబి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులకు సహాయం అందించారు.

Slug: uyyuru-ntr-bharosa-pensions-distribution-former-mlc-yvb-rajendra-prasad