జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ మరీదు కృష్ణ మరియు సీనియర్ సలహాదారు శ్రీ శ్రీధర్ ఆచార్యులు విచ్చేసి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం సత్యం, అహింస మార్గంలో పోరాడిన మహనీయుని త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారతదేశానికి సరైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. అలాంటి మహాత్మా గాంధీ మన గడ్డపై జన్మించడం దేశ ప్రజల పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. గాంధీజీ ఆలోచనా విధానాలు, సిద్ధాంతాలు కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం ఎప్పటికీ మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీ బీడీ రవికుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ పరిమి సాగర్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ గోపే మురళి, పీసీసీ మాజీ సభ్యులు శ్రీ టి.ఆర్.బి. విటల్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు నూజివీడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ ఆంజనేయులు, నూజివీడు రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పొట్లూరి రాంబాబు, ముసునూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సూర్యదేవర ప్రసాద్, ఆగిరిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ చీకటి దుర్గారావు, సీనియర్ నాయకులు శ్రీ వనమా ఫ్రాన్సిస్, శ్రీ దుక్కిపాటి ప్రకాష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.
Slug: nuzvid-congress-office-gandhi-jayanti-maridu-krishna
