రచన: జన గళం నందలూరు/రాజంపేట డెస్క్: నందలూరు మండలానికి చెందిన పల్లె నాగయ్య ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ఆయనను స్వయంగా కలిసి పరామర్శించారు. నాగయ్య నివాసానికి చేరుకున్న ఆయన, ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్సల వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నాగయ్య త్వరలోనే సంపూర్ణ ఆయురారోగ్యాలతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆకుల చలపతితో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు భరోసా ఇచ్చారు.
