బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏
ఆంద్ర ప్రదేశ్

ఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపు

ఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపు

Slug: minister-nara-lokesh-pedana-tour-on-17th-kagitha-krishna-prasad-call-to-tdp-cadre

​జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 17వ తేదీన కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుండటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. మంత్రి లోకేష్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోకేష్ పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గ ముఖ్య నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.

​ఈ నెల 17వ తేదీన పెడన పట్టణానికి విచ్చేస్తున్న మంత్రి నారా లోకేష్ కు స్థానిక తామర చెరువు సెంటర్ వద్ద పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారని కాగిత కృష్ణప్రసాద్ వెల్లడించారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో పెడన నుంచి మచిలీపట్నం ప్రధాన రహదారిలోని బెరకా ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ పర్యటనకు సంబంధించి సమయం చాలా తక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి సమష్టి కృషితో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా ప్రతి వార్డు, గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనేలా సమాయత్తం కావాలని స్పష్టం చేశారు.

Related News Desk పత్రికా ప్రకటన

​కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ యువ నాయకుడు నారా లోకేష్ పర్యటన పెడన నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు సరికొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. లభించిన స్వల్ప వ్యవధిలోనే పకడ్బందీ ప్రణాళికతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి నాయకులపై ఉందని గుర్తుచేశారు. ఈ పర్యటనలో యువత, మహిళా శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై పసుపు జెండా సత్తా చాటాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువ నాయకత్వ పర్యటన కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన వివరించారు.

​ఈ సన్నాహక సమావేశానికి పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య అధ్యక్షత వహించగా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో పాటు పలువురు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. లోకేష్ రాక సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి, భారీ జనసమీకరణతో స్వాగత ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.