మంగినపూడిలో సాగరతీర మహాగణపతి మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్
విజయగణపతిని దర్శించుకోనున్న రాష్ట్ర గవర్నర్
మచిలీపట్నం: సెప్టెంబర్ 14, 2026
కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో నిర్వహిస్తున్న సాగరతీర మహాగణపతి మహోత్సవమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
రాష్ట్ర గవర్నర్ సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం సాయంత్రం రోడ్డు మార్గంలో మంగినపూడి బీచ్ కు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు మహోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు. మంగినపూడి సాగరతీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల సాగరతీర విజయగణపతిని దర్శించి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నది.
………………………
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కృష్ణా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది.
