జన గళం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యూరో: సమత ఆర్ట్స్ పతాకంపై రవి కందుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘వన్ ప్లస్ వన్’ (One + One = Family) ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. అక్టోబర్ 10వ తేదీన ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేదికగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వేడుకకు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ రావణం స్వామినాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేణు మాధవ్ వడవల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ రెడ్డి సంగీతం అందించారు. కుటుంబ అనుబంధాలు, ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఫుల్ వీడియోను అక్టోబర్ 15న సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
Slug: one-plus-one-family-movie-trailer-launch-ravanam-swami-naidu-film-chamber-hyderabad
