జన గళం మచిలీపట్నం బ్యూరో: స్మార్ట్ మీటర్ల విధానం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారంగా, శాపంగా మారకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం నేత కోన నాగార్జున కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ అంశంపై పేదలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. నెల ఒకటో తేదీకే కరెంట్ బిల్లు చెల్లించాలనే నిబంధన రోజువారీ కూలీలతో కాలం వెళ్లదీసే పేదవారికి పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, అత్యవసర వైద్య ఖర్చులతో సతమతమయ్యే పేద కుటుంబాలకు విద్యుత్ బిల్లుల చెల్లింపులో తగిన గడువు ఇవ్వాలని స్పష్టం చేశారు. రెండో నెలలో కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితులు ఉంటే వెంటనే కరెంట్ సరఫరా నిలిపివేయకుండా, మూడో నెల వరకు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాంకేతికత పేదలకు సౌకర్యంగా ఉండాలే తప్ప వారిని ఇబ్బందులపాలు చేసే శిక్షగా మారకూడదని, అదానీ సంస్థ కూడా క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు.
స్మార్ట్ మీటర్లు పేదలకు శిక్షగా మారకూడదు: సీఎం చంద్రబాబుకు కోన నాగార్జున విజ్ఞప్తి!
Slug: Slug: kona-nagarjuna-appeal-cm-chandrababu-smart-meters-deadline-relief-for-poor-machilipatnam
