జన గళం గన్నవరం/కృష్ణా బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ ప్రకటించిన మచిలీపట్నం పార్లమెంట్ నిర్వాహక్ దళ్ (నిర్వహణ కమిటీ) సభ్యుడిగా విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు, గన్నవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పొదిలి దుర్గారావు నియమితులయ్యారు. తనపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన తన రాజకీయ గురువు, పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, పార్టీ పటిష్టత, కార్యకర్తల సమన్వయం మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగురవేయడానికే నిస్వార్థంగా వినియోగిస్తానని దుర్గారావు స్పష్టం చేశారు.
మచిలీపట్నం పార్లమెంట్ నిర్వాహక్ దళ్‌లో పొదిలి దుర్గారావు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు!
Slug: podili-durga-rao-appointed-machilipatnam-nirvahak-dal-thanks-pawan-kalyan-gannavaram
